2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారుతుంది

| Edited By:

Sep 20, 2020 | 11:10 AM

2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారనుందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.

2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారుతుంది
Follow us on

Andhra Pradesh alcohol: 2024 నాటికి ఏపీ మద్య రహిత రాష్ట్రంగా మారనుందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. అందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పోలిస్తే..  ప్రస్తుతం 30 శాతం మద్యం, 60 శాతం బీర్లు విక్రయాలు తగ్గాయని అన్నారు.

2024 నాటికి రాష్ట్రంలో త్రీస్టార్, ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కే మద్యం పరిమితం కానుందని తెలిపారు. మద్య రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయతిస్తోంది. ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. మద్యపానంతో కలుగుతున్న నష్టాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై షార్ట్‌ ఫిల్మ్‌ల పోటీలకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆ విజేతలకు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గుంటూరులో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణ స్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,137 కొత్త కేసులు.. 8 మరణాలు

Corona Tests: ఏపీలో 50లక్షలు దాటిన కరోనా టెస్ట్‌ల సంఖ్య