AP Anganwadi Jobs 2023: విశాఖపట్నంలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్షలేదు..టెన్త్ పాసైతే చాలు

|

Jun 08, 2023 | 3:54 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కింద పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 34 అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ..

AP Anganwadi Jobs 2023: విశాఖపట్నంలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్షలేదు..టెన్త్ పాసైతే చాలు
AP Anganwadi Jobs
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కింద పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 34 అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు 2, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు 32 వరకు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నంలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్ధులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జులై 1, 2022వ తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 35 యేళ్లలోపుండాలి. ఈ అర్హతలతోపాటు సంబంధిత గ్రామంలో నివాసముండే మహిళా అభ్యర్ధులై ఉండాలి. ఆసక్తికలిగిన వారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో విశాఖపట్నంలోని సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో జూన్‌, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000ల చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.