Vizag Municipal Results: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎక్కడ చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోతోంది అయితే విశాఖ 89 వార్డును టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఈ వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టిన అధికారులు.. ముందుగా వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అధికారులు తప్పుడు ప్రకటన చేశారని, తమ అభ్యర్థే గెలుపొందుతారని ఆందోళన దిగారు. మళ్లీ రీకౌంటింగ్ చేసే వరకు ఊరుకునేది లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. అనంతరం 73 ఓట్లతో టీడీపీ అభ్యర్థి రమేష్ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక విశాఖ కార్పోరేషన్‌లో మొత్తం 98 డివిజన్లలోనూ వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 3, బీజేపీ 1, సీపీఎం 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుచుకున్నారు.
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ సత్తా చాటుతోంది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పత్తా లేకుండా పోతున్నాయి. ఎటు చూసినా వైసీపీ అధిపత్యం కొనసాగిస్తోంది. ఇక విశాఖ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబర్చింది.
ఇవీ చదవండి: AP Municipal Election Results 2021: వైసీపీ ప్రభంజనంలో గ్లాస్ గల్లంతు.. కమలం కకావికలం
AP Municipal Election 2021 results: పారని పాచికలు.. అధినేత ప్రచారం చేసినా ఆదరణ శూన్యం