Dolphin Dead Body : విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన డాల్ఫిన్ మృత దేహం ..
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం కనిపించింది. శరీరంపై గాయాలతో.. ఓ డాల్ఫిన్ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. విశాఖలోని యారాడ సముద్ర తీరాన ఈ దృశ్యం వెలుగు చూసింది...
Dolphin Dead Body : విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం కనిపించింది. శరీరంపై గాయాలతో.. ఓ డాల్ఫిన్ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. విశాఖలోని యారాడ సముద్ర తీరాన ఈ దృశ్యం వెలుగు చూసింది.
చేప మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్స్యకారులు డాల్ఫిన్ శరీరంపై గాయాలు ఉన్నట్లు గమనించారు. వీటి కారణంగానే డాల్ఫిన్ ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లుగా మత్స్యకారులు తెలిపారు. మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుందని తెలిపారు.
మరోవైపు మానవుడు విలాస జీవనం పేరుతో పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేయడం మాత్రమే కాదు, అవి ఎన్నో అమాయక మూగ ప్రాణులను తీస్తున్నాయి. ఒక పర్యావరణ అధ్యయనంలో తేలిందేమంటే భూమిపై పారవేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎనభై శాతం సముద్ర జలాల్లోనే కలుస్తున్నాయి. దీంతో సముద్రంలో ఉండే చేపల మనుగడకే ప్రమాదం ఏర్పడిందన పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుకోని ప్రమాదాలతో కూడా అరుదైన జాతికి చెందిన చేపలు మృత్యువాత పడుతున్నాయి.
Also Read: