Botsa : టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప..సూచనలు ఇచ్చే అలవాటు లేదు, అందు కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన : బొత్స

|

Jun 10, 2021 | 5:20 PM

ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని చెప్పిన ఆయన, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా చిలువలు పలువలు చేసి..

Botsa : టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప..సూచనలు ఇచ్చే అలవాటు లేదు, అందు కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన : బొత్స
Botsa Satyanarayana
Follow us on

Botsa Satyanarayana : టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప.. సూచనలు ఇచ్చే అలవాటు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని చెప్పిన ఆయన, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా చిలువలు పలువలు చేసి టీడీపీ, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల వసూళ్లపై మూడు రాష్ట్రాల్లో అధ్యాయనం చేసిన తరువాత ప్రజలపై భారం పడకుండా పన్నులు పెంపు చట్టాన్ని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించినట్లు గుర్తు చేశారు.

విశాఖ‌లోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లడం సర్వసాధారణమని బొత్స అన్నారు. కేంద్రంతో ముడిపడిన అంశాలు, రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలు, కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రంతో తరచుగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారని చెప్పారు.

అందులో భాగంగానే సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి సమయంలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులు వారి కార్యక్రమాలను బట్టి కలవకపోవచ్చు దానిని కూడా టీడీపీకి ఒత్తాసు పలుకుతున్న మీడియా రచ్చ చేయాలని చూస్తుందని బొత్స ఆరోపించారు. కరోనా మహమ్మారి, వ్యాక్సినేషన్‌ గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదన్న బొత్స. సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు విత్తనం నుంచి పంటలు కొనుగోలు చేసే వరకు తోడుగా నిలిచారన్నారు.

రాష్ట్ర చరిత్రలో రైతులకు ఇంతగా అండగా నిలిచిన ప్రభుత్వం మాది అంటూ బొత్స పేర్కొన్నారు. “మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటున్నాం. కాదు.. అని చంద్రబాబు నిరూపించగలరా?. ఊకదంపుడు, పనికిమాలిన మాటలు ప్రతిపక్షం మానుకోవాలి. వక్రభాష్యం చెబుతూ కాలం వెల్లదీయడం చంద్రబాబుకు సరికాదు” అంటూ బొత్స విరుచుకుపడ్డారు. “కొత్తగా పన్నులు పెంచారని మాట్లాడుతున్నారు. మీ మనసాక్షిగా చెప్పండి. ఎన్నికల ముందు పన్నుల గురించి ప్రకటన చేయలేదా?. గతంలో అసెంబ్లీలో తానే మాట్లాడాను. ప్రతిపక్ష సభ్యులు కూడా పన్నుల గురించి మాట్లాడారు కదా? ఈ రోజు మేం కొత్తగా తీసుకువచ్చినట్లు పత్రికలు కథనాలు రాస్తున్నాయి.” అని బొత్స వ్యాఖ్యానించారు.

నివాసం ఉన్న భవనాలకు 0.10 నుంచి 0.50 వరకు, నివాసం కాని భవనాలకు 0.20 నుంచి 2 శాతం వరకు పన్నులు వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలపై భారం పడటానికి వీల్లేదని, వారికి మంచి చేసేందుకు 15 శాతానికి మించకుండా పన్ను ఉండేలా చట్టాన్ని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని.. ఆ ప్రకారమే చట్టం చేశామని బొత్స వెల్లడించారు.

Read also : Anilkumar yadav : “జగన్ అముల్ బేబీ అయితే, లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి” : ఏపీ మంత్రి