కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఇంటి వద్ద నుంచి ఉదయమే బయల్దేరిన సీఎం జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప ఎయిర్ పోర్టు‌కు బయల్దేరారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం […]

కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్‌

Edited By:

Updated on: Sep 02, 2019 | 7:38 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఇంటి వద్ద నుంచి ఉదయమే బయల్దేరిన సీఎం జగన్.. కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప ఎయిర్ పోర్టు‌కు బయల్దేరారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల చేరుకుంటారు. అక్కడ దివంగత నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.