Oxygen : జగన్ సర్కారు ఆపరేషన్ ఆక్సిజన్ : కరోనా కల్లోలం నేపథ్యంలో నాలుగు ప్రాంతాల నుంచి ప్రాణవాయువు తెచ్చుకునేలా ప్రణాళికలు

|

Apr 21, 2021 | 10:12 PM

Jagan Government Operation Oxygen : దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ.. ఆక్సిజ‌న్ కొర‌త ప్రాణాలు తీస్తోంది.

Oxygen : జగన్ సర్కారు ఆపరేషన్ ఆక్సిజన్ : కరోనా కల్లోలం నేపథ్యంలో నాలుగు ప్రాంతాల నుంచి ప్రాణవాయువు తెచ్చుకునేలా ప్రణాళికలు
Oxygen Express Trains
Follow us on

Jagan Government Operation Oxygen : దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ.. ఆక్సిజ‌న్ కొర‌త ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీలోనూ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో జగన్ సర్కార్‌ అప్రమత్తమైంది. కరోనా కట్టడితో పాటు చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది. నాలుగైదు రోజులుగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల కరోనా పెషెంట్స్‌ ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కొర‌త మ‌రింత పెర‌గ‌కుండా కావాల్సిన ప్లాన్ సిద్ధంచేస్తోంది ప్రభుత్వం. ఎంతమంది రోగుల‌కు ఆక్సిజ‌న్ ఆవ‌స‌రం అవుతోంది. ఇప్పుడెంత ఉంది…? ఇంకెంత కావాలి.? అవ‌స‌రమైన మేర‌కు ఎక్కడ నుంచి తీసుకురావాలనే అంశాల‌పై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక‌వేళ కొవిడ్ కేసులు ఇంకా పెరిగితే… ఏ మేరకు ఆక్సిజన్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోందని.. భారీగా కేసులు పెరిగితే.. సుమారు 200 టన్నుల ఆక్సిజన్ కావాల్సుంటుందని అధికారులు భావిస్తున్నారు. అవసరం మేరకు నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నైల నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధంచేస్తోంది.

ఇప్పటికే విశాఖ నుంచి 80 టన్నులు, భువనేశ్వర్ నుంచి 70 టన్నులు సరఫరా చేసేందుకు అంగీకరించాయని ప్రభుత్వవ‌ర్గాలు చెపుతున్నాయి. కాగా.. దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరాను మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితులనైనా.. ఎదుర్కొనేలా ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్‌ నిల్వలను సమకూరుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ నిల్వలను కూడా జాగ్రత్తగా వినియోగించుకునేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Read also :  Oxygen Leaks : హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం.. భారీ ఆక్సిజన్ సిలిండర్ల నుంచి పెద్ద ఎత్తున లీకేజ్..22 మంది రోగుల మృతి