
కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉండే వారిని ఇప్పటికే ఫ్రీ కిట్‌ను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం.. వారు ఎలాంటి జాగ్రతలు పాటించాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏం చేయకూడదో మార్గదర్శకాలు విడుదల చేసింది.
హోమ్ ఐసోలేషన్‌లో చేయాల్సినవి ఇవే:
1.నిద్ర, ఎక్సర్‌సైజ్, స్నానం, భోజనం చేసేటప్పుడు తప్ప ఎల్లప్పుడూ మాస్క్ ధరించి ఉండాలి.
2.ఉదయం లేవగానే కరోనా సోకిన వ్యక్తి తన రూమ్‌ని తనే క్లీన్ చేసుకోవాలి.
3.రోగి ధరించిన బట్టలను వేడి నీటిలో తానే ఉతికి ఆరేసుకోవాలి. తన వస్తువులు, పాత్రల్ని తానే కడుక్కోవాలి.
4.రోజూ యోగా, ఎక్సర్‌సైజ్, ధ్యానం చేయాలి.
5.బలమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని రోగులు తీసుకోవాలి.
6.డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడాలి. తన ఆరోగ్యంపై రోగి దగ్గర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్త లేదా ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కి తెలుపుతూ ఉండాలి.
7.కుటుంబ సభ్యులతో రోగి భౌతిక దూరం పాటించాలి.
8.కరోనా లక్షణాలు పెరుగుతున్నా, బయటపడినా, ఆరోగ్య కార్యకర్తకు చెప్పాలి.
చేయకూడని పనులివే:
1.ఇతరులను ఇంట్లోకి రానివ్వకూడదు.
2.మీ వస్తువులను ఎవరూ ముట్టుకోకుండా చూసుకోవాలి.
3.బయటకు వెళ్లకూడదు, ఇతరులను కలవకూడదు.
తీసుకోవాల్సిన మాత్రలు ఇవే:
1.రోజుకు రెండు సార్లు(ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు)విటమిన్ సి.
2.రోజుకు రెండు సార్లు(ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు) మల్టీమిటమిన్.
3.రోజుకు ఒకసారి(ఉదయం 8 గంటలకు) జంక్ మాత్ర
4.జలుబు లేదా దగ్గుఉంటే రోజుకు ఒకసారి(ఉదయం 8 గంటలకు)సెట్రిజిన్ 10మి.గ్రా.
5.జ్వరం ఉంటే రోజుకు రెండు సార్లు(ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు) పారాసిటమోల్ 500 మి.గ్రా.
6.కడుపులో మంట ఉంటే రోజుకు రెండు సార్లు(ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు) రానీటిడిన్ 150మి.గ్రా
Read This Story Also: ఇసుకపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!