ఓ హాస్టల్ వార్డెన్ వికృత చేష్టలు..

| Edited By:

Feb 15, 2019 | 5:48 PM

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటలోని ఆనంద నిలయం హాస్టల్ వార్డెన్ పాండుయాదవ్ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై కన్నేశాడు. వారం రోజులుగా సెల్ ఫోన్లో […]

ఓ హాస్టల్ వార్డెన్ వికృత చేష్టలు..
Follow us on

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నారాయణ పేటలోని ఆనంద నిలయం హాస్టల్ వార్డెన్ పాండుయాదవ్ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై కన్నేశాడు. వారం రోజులుగా సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడమని వేధించసాగాడు. మంగళవారం రాత్రి విద్యార్థినిని చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కాగా.. వార్డెన్ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో తల్లితండ్రులు నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.