AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: బానే ప్లాన్ చేశావ్ కానీ పద్మ.. ఆ కాస్టూమ్‌ మాత్రం అస్సలు సెట్ అవ్వలే…

విశాఖలోని ఓ ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వయసుమళ్లిన మహిళ కళ్ళల్లో కారం కొట్టి చేతికున్న బంగారు గాజులు తీసుకొని పరారయ్యాడు. ఎవరో తెలిసిన వారి పని అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. సీసీ ఫుటేజ్ చూడగా రెయిన్ కోట్ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టి దర్జాగా లోపల వెళ్లి పని కానిచ్చి వెళ్లిపోయాడు ఆ దొంగ. బాగా డీటేల్డ్‌గా చూస్తే ఈ పని చేసింది ఆడదొంగ అని తేలింది. చివరకు ఆమె ఎవరో తెలిశాక అందరూ షాక్..!

Vizag: బానే ప్లాన్ చేశావ్ కానీ పద్మ.. ఆ కాస్టూమ్‌ మాత్రం అస్సలు సెట్ అవ్వలే...
Maid Steals Jewelry
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 22, 2025 | 6:15 PM

Share

విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ వర్మ భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 17వ తేదీన అతని ఇంట్లో ఒక చోరీ జరిగింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇంట్లోకి చొరబడింది ఓ మహిళా దొంగ. వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి.. చేతికి ఉన్న బంగారు గాజులు ఎత్తుకెళ్లింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో.. ఓ మహిళ మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు విచారించారు. దీంతో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. తెలిసిన వారి పని అయి ఉంటుందని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నారా నేను దానిపై ఆరా తీశారు.

పద్మ అనే మహిళ వృద్ధురాలికి కేర్ టేకర్ పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎరుపు రంగు స్కూటీతో ఆమె ఇంటికి వచ్చేదని నిర్ధారించుకున్నారు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లేసరికి శివాజీ పాలెంలో ఆమె ఇంటి వద్ద ఎరుపు రంగు స్కూటి ఉండడాన్ని చూశారు. సీసీ కెమెరాల్లో కనిపించిన దుస్తులు సైతం ఆమె ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించేసరికి.. అసలు విషయం తేలిపోయింది. కేర్ టేకర్‌గా పనిచేసిన పద్మ.. దొంగ అవతారం ఎత్తి మాస్క్ ధరించి దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి రెండు లక్షల విలువైన రెండు బంగారు గాజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్