Ap News: వైద్యుల నిర్లక్ష్యంలో వీధి కుక్క మృతి.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్..!

| Edited By: Ravi Kiran

Aug 09, 2022 | 4:02 PM

Andhra Pradesh: మనుషులకు ఆరోగ్యం బాగలేకపోతే కుటుంబ సభ్యులో, బంధువులో హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యులకు చూపించి దగ్గరుండి చూసుకుంటారు.

Ap News: వైద్యుల నిర్లక్ష్యంలో వీధి కుక్క మృతి.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్..!
Dog
Follow us on

Andhra Pradesh: మనుషులకు ఆరోగ్యం బాగలేకపోతే కుటుంబ సభ్యులో, బంధువులో హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యులకు చూపించి దగ్గరుండి చూసుకుంటారు. కానీ మూగ జీవాల పరిస్థితి ఏంటి? అందులోనూ వీధి కుక్కల పరిస్థితి ఏంటి. వాటిని ఎవరు చూసుకుంటారు. అనారోగ్యంతో ఉంటే అవి అలా చనిపోవాల్సిందేనా. తాజాగా అనారోగ్యం పాలైన వీధి కుక్కను ఓ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లి బ్రతికించే ప్రయత్నం చేసినా వైద్యుల నిర్లక్ష్యం కుక్క ప్రాణాలు తీసింది.

విజయవాడ మొగల్ రాజపురానికి చెందిన కీర్తి జంతు ప్రేమికురాలు. రోజూ వీధి కుక్కలకు స్వయంగా అన్నం వండి వెతుక్కుంటూ వెళ్లి పెడుతుంది. అయితే బందరు రోడ్డులోని స్వగృహ ఫుడ్స్ వద్ద వీధి కుక్క అపస్మారక స్థితిలో పడిపోయి ఉందని స్థానికులు మహిళకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అక్కడకు వెళ్లిన మహిళ కుక్కను హాస్పిటల్ కు తీసుకెళ్లేందు ప్రభుత్వ అంబులెన్స్ 1962 కు కాల్ చేసింది. ఎంత సేపటికి అంబులెన్స్ సిబ్బంది స్పందించకపోవడంతో ఆటోలో కష్టపడి గర్భిణి కుక్కను ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు తాము కాదు అంటే తాము కాదని రెండు గంటలు పాటు మహిళను తిప్పారు. మహిళ ఎంత బతిమాలినా కుక్కకు చికిత్స మాత్రం చేయలేదు. కొంత సేపటికి వైద్యుల నిర్లక్ష్యంతో కుక్క మృతి చెందింది. దీంతో సదరు మహిళ హాస్పిటల్ వద్ద వైద్యులకు వ్యతిరేకంగా అందోళనకు దిగింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంత ప్రయత్నం చేసినా గర్భిణి కుక్క మృతి చెందడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..