ఆ నగరంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటేనే వణికిపోతున్న ఓనర్స్.. ఎందుకో తెలుసా?

ఎప్పుడు రద్దీగా ఉండే విజయవాడ నగరం ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది.. నగరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరిగాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో నగరం మొత్తం ఉలిక్కపడింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. విజయవాడ సరిహద్దుల్లోని కానూరులో అనుమానస్పద కదలికలు గుర్తించారు.. దీంతో బెజవాడలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

ఆ నగరంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటేనే వణికిపోతున్న ఓనర్స్.. ఎందుకో తెలుసా?
Tolet

Edited By: Anand T

Updated on: Nov 19, 2025 | 5:44 PM

మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన పెరిగింది. పాత రోజులు మళ్లీ వచ్చాయోమో అనే భయం ఇప్పుడు జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో నగరంలో ఎవరు కొత్తగా కనిపించినా ప్రజలు వారిని అనుమానిస్తున్నారు.  దీంతో విజయవాడలో ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు జనాలు భయపడిపోతున్నారు. ఇక్కడ ఇల్లు అద్దెకు ఇవ్వడం అనేది ఒకప్పుడు సామాన్య ప్రక్రియ.. ఒక ఫోన్ లేదా రెండు మాటలు చెప్తే చాలు ఇల్లు అద్దెకు ఇచ్చువారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది.

అద్దెకు ఇల్లు ఇవ్వాలంటే ప్రజలు కఠిన నిబంధనలు పెడుతున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటే ఆధార్ కార్డు, పాన్‌ కార్డు డీటెల్స్‌  తప్పనిసరి అంటున్నారు. కొంతమంది అయితే పాత రెంటల్ అడ్రస్ , ఆఫీస్ ఐడి,  ఫోన్ నెంబర్, వెరిఫికేషన్ కూడా అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది.. ప్రజలు ఇంతలా భయడడానికి ప్రధాన కారణం.. అనుమానాస్పద వ్యక్తులు విజయవాడ నగరంలోకి ప్రవేశించారని ప్రచారం జరగడం.

దీంతో పాటు అద్దెకు ఇల్లు ఇచ్చేముందు వారి పూర్తి వివరాలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేయడం కూడా ఇందుకు ఒక కారణం. అలాగే వారి వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌కు కూడా తెలియచేయాలని పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఇంటి యజమనాలు తమ ఇంట్లో ఉంటున్న వారి ఫ్యామిలీ వివరాలను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడలో అద్దె ఇల్లు గదులు ,హాస్టల్లో కూడా వెరిఫికేషన్ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. కొంచెం అనుమానం వచ్చినా ప్రజలు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.. ఒకవైపు నగర అభివృద్ధి మరోవైపు భద్రతా చర్యలు ఇలా రెండు ముఖ్యమని నగర ప్రజలు తెలియజేస్తున్నారు. కావునా అద్దెకు వచ్చే వాళ్లు కూడా తమకు సహకరించాలని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.