Viral: తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో అస్పత్రికొచ్చిన యువతి.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.!

| Edited By: Ravi Kiran

Aug 05, 2023 | 9:08 AM

ఓ అరుదైన శస్త్రచికిత్స స్థానికంగాసంచలనమైంది. ఓ యువతి పొట్టలో నుంచి గొంతు వరకూ చుట్టేసిన వెంట్రుకలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయడమే కాకుండా.. వైరల్‌గా కూడా మారింది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.. వారి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో.? అసలు విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా.?

Viral: తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో అస్పత్రికొచ్చిన యువతి.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.!
Doctors Operation
Follow us on

అప్పుడప్పుడూ అరుదైన వ్యాధులకు శస్త్రచికిత్సలు నిర్వహించి.. పేషెంట్లకు పునర్జన్మను ఇస్తుంటారు డాక్టర్లు. ఇలాంటి సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యపరుస్తాయి. ఇలా కూడా జరుగుతాయా? అనిపించేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. 18 ఏళ్ల యువతి కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండేది. కుటుంబసభ్యులు కంగారుపడి.. ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్లు సదరు యువతికి పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం ఎక్స్‌రే చూడగానే.. వారి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది.? ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ఓ అరుదైన శస్త్రచికిత్స స్థానికంగా సంచలనమైంది. ఓ యువతి పొట్టలో నుంచి గొంతు వరకూ చుట్టేసిన వెంట్రుకలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ సర్జరీ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేయడమే కాకుండా.. వైరల్‌గా కూడా మారింది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువతి గత కొంతకాలంగా వెంట్రుకలు చుట్టుకుని మింగుతుండేది. అవి పొట్టలో చుట్టుకుపోయి క్రమేణా గొంతులోకి వ్యాప్తి చెందాయి. దీంతో ఏమీ తినలేని, తాగలేని పరిస్థితుల్లో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆమెపై పలు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు.. ఆ తర్వాత ఎక్స్‌రే తీసి చూడగా.. భారీగా వెంట్రుకలు చుట్టుకుని గొంతు వరకు ఉన్నట్టు గుర్తించారు. తొలుత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు ఆమెను పరీక్షించి.. ఎండోస్కోపీ టెస్ట్ ద్వారా తొలగించాలని ప్రయత్నించగా.. అది సాధ్యం కాలేదు. దీంతో ఆమెకు శుక్రవారం ఆసుపత్రిలోని సర్జన్లుగా పని చేస్తోన్న దుర్గారాణి, చందన ప్రియాంక, గాయత్రి, ప్రవీణ్ కుమార్‌ల బృందం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి పొట్టలో చుట్టుకుపోయిన వెంట్రుకల చుట్టను ఎట్టకేలకు తొలగించారు. గొంతు వరకూ వ్యాప్తి చెందడంతో శస్త్ర చికిత్స క్లిష్టతరంగా మారిందని వైద్యులు తెలిపారు.

కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. కొందరు మానసిక రుగ్మతుల కారణంగా ఇలా చేస్తుంటారని.. ఇంకొందరు చిన్ననాటి నుంచి మెదడు సరిగ్గా పని చేయకపోవడం వల్ల.. ఇలాంటి అలవాటును అవలంభించుకుంటారని.. మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కేసులు రావడం చాలా అరుదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..