Andhrapradesh: కూరగాయల, చికెన్ ధరలు పై పైకి .. ఏం కొనేటట్టులేదు..ఏం తినేటట్లు లేదంటున్న సామాన్యులు

|

May 16, 2022 | 7:24 AM

రోజు రోజుకీ పెరిగిపోతున్న ధరలతో పేద, మధ్యతరగతివారి బడ్జెట్ పై పెనుభారం పడుతోంది.  టమాటా ధర సెంచరీకి చేరువలో ఉంది. మరోవైపు చికెన్ ధరలు చుక్కలను తాకుతుంది.

Andhrapradesh: కూరగాయల, చికెన్ ధరలు పై పైకి .. ఏం కొనేటట్టులేదు..ఏం తినేటట్లు లేదంటున్న సామాన్యులు
Andhrapradesh
Follow us on

Andhrapradesh: ఓ వైపు వేసవి కాలంతో పంట దిగుబడి తగ్గడంతో పాటు.. మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్ల వేడుకలతో కూరగాయల ధరలకు రెక్కలు వస్తే.. ఇంకోవైపు కోడి ధర(Chicken Cost) కొండెక్కి కూర్చుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న ధరలతో పేద, మధ్యతరగతివారి బడ్జెట్ పై పెనుభారం పడుతోంది.  టమాటా ధర(Tomato Price Hike) సెంచరీకి చేరువలో ఉంది. కిలో టమాటా ధర రూ. 80 లు ఉండగా, క్యారెట్, బీరకాయలు, కిలో రూ 60లు ఉన్నాయి. ఇక వంకాయ, కాకరకాయ, వంటి కూరగాయల ధరలు కూడా అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నాయి. అల్లం అయితే కిలో రూ. 300 లు ఉంది. ఆకూ కూరలు ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. చికెన్‌, మటన్‌, కోడిగుడ్ల ధరలు కూడా కూరగాయల ధరలతో పోటీ పడుతున్నాడు.

టమాట వంటకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టమాటా ధర. 80లకు చేరుకోవడంతో..  సామాన్యులు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది మొదటి నుంచి గత నెల ఏప్రిల్ వరకూ టమాటా ధర కిలో రూ. 15 లు దాటలేదు. అయితే ఎండలు మండిస్తున్నప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ.. వస్తోంది. దీనికి కారణం.. ప్రస్తుతం మార్కెట్ లో మదనపల్లి నుంచి మాత్రమే టమాటా వస్తుందని.. అందుకనే డిమాండ్ పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.

మరోవైపు మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తూ.. చికెన్ ధరలు పెరిగిపోతూ.. చుక్కలు చూపిస్తున్నాయి. వారం రోజుల క్రితం. కిలో చికెన్ రూ. 250 ఉండగా ఇప్పుడు యాభై రూపాయలు పెరిగి.. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300లకు చేరుకుంది. దీంతో వినియోగదారులు ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారం పడిపోయిందని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..