పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు వారిని దూరంగా ఉంచాలి.. ఎస్‌ఈసీని కోరిన టీడీపీ నేత వర్ల రామయ్య

|

Jan 23, 2021 | 12:21 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల సంఘానికి టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు..

పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు వారిని దూరంగా ఉంచాలి.. ఎస్‌ఈసీని కోరిన టీడీపీ నేత వర్ల రామయ్య
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల సంఘానికి టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉంచాల‌ని ఆయ‌న ఎస్‌ఈసీని కోరారు. ఎన్నిక‌ల అధికారుల‌తో సహా సిబ్బందికి ఇతర డివిజ‌న్ల‌లో విధులు కేటాయించాలని పేర్కొన్నారు.

ఎన్నిక‌లు కేంద్ర భ‌ద్ర‌తా ద‌ళాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్వ‌హించాల‌ని వర్ల రామయ్య కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాల‌ని అన్నారు. ఓటర్లు, అధికారులు కరోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా నిబంధ‌న‌లు కఠినంగా అమ‌లు చేయాల‌ని లేఖలో కోరారు.

మరోవైపు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై డీజీపీ స‌వాంగ్ ను వ‌ర్ల రామ‌య్య ట్విట్ట‌ర్ లో నిల‌దీశారు. ‘డీజీపీ గారూ! చంద్రబాబు వాహనంపై రాళ్లతో, చెప్పులతో, కర్రలతో దాడి చేస్తే, అది రాజ్యాంగం ప్రజలకిచ్చిన”స్వేచ్ఛ” అని సెలవిచ్చారు, ఏ చర్యలూ తీసుకోలేదు. మరి, ఏ2 విజయసాయిరెడ్డి కారుపై వాటర్ బాటిల్ పడితే, అది, ఏ రకంగా ఆయనపై హత్యాయత్నం అయింది సార్. ఈ చిక్కుముడి విప్పి ప్రజలకు చెప్పండి’ అని ఆయ‌న నిల‌దీశారు.