Corona Vaccine: ఏపీలో నిత్యం పదివేలు దాటుతున్న కరోనా కేసులు… ఈ నెల 26, 27 తేదీల్లో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండో విడత టీకా

|

Apr 23, 2021 | 6:39 AM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Corona Vaccine: ఏపీలో నిత్యం పదివేలు దాటుతున్న కరోనా కేసులు... ఈ నెల 26, 27 తేదీల్లో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండో విడత టీకా
Covid Vaccine
Follow us on

Covid 19 Vaccine for MLA and MLC: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మహమ్మారిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంపు, కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచటం, రెమెడిసివిర్ ఇంజెక్షన్ లభ్యత, ఆక్సిజన్ కొరత లాంటి అన్ని అంశాలపై అధికారులకు సూచనలు చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ, శాసనమండలి కార్యక్రమాలకు హాజరయ్యే పత్రికా విలేకరులు ఈ నెల 27న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని సూచించారు.

ఇదిలావుంటే, గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 9,97,462 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7,541 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 66,944 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 9,22,977 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Read Also… 

Viral Video: నీటి అడుగున ఆక్సిజన్ లేకుండానే డాన్స్ తో అదరగొట్టిన అమ్మాయి ఆశ్చర్య పరుస్తున్న వైరల్ వీడియో..