Andhra Pradesh: రావాలమ్మా రావాలి.. కరోనా వ్యాక్సిన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేయించుకోండమ్మా..

|

Sep 24, 2021 | 9:34 PM

వీళ్లు హెల్త్‌ వర్కర్స్‌లాగే ఉన్నారే.. ఏవో పల్స్‌ పోలియో టీకాలు వేస్తున్నారనుకుంటా.. అలాగని మీరు పొరపడొద్దండోయ్‌. ఎందుకంటే..

Andhra Pradesh: రావాలమ్మా రావాలి.. కరోనా వ్యాక్సిన్.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వేయించుకోండమ్మా..
Ap Corona Vaccination
Follow us on

గ్రామాల్లో జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ
వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు
సోషల్ మీడియాలో వీడియో వైరల్

వీళ్లు హెల్త్‌ వర్కర్స్‌లాగే ఉన్నారే.. ఏవో పల్స్‌ పోలియో టీకాలు వేస్తున్నారనుకుంటా.. అలాగని మీరు పొరపడొద్దండోయ్‌. ఎందుకంటే..వీళ్లు వేసేది మరేవో టీకాలు కాదు.. కరోనా మహమ్మారి కట్టడి వేస్తున్న వ్యాక్సిన్లు. అవును మీరు వింటున్నది నిజమే. వీధుల వెంట తిరుగుతూ..హెల్త్‌ వర్కర్లు ఇలా వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు.

ఏపీలోని గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంలో హెల్త్ వర్కర్లు కొవిడ్ వ్యాక్సిన్ల డబ్బాలను పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కొన్ని ఊర్లలో పొలాలకు వెళ్లి మరి రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్లు వేస్తున్నారట.. ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టే వ్యాక్సినేషన్‌లో మన దేశం కొత్త రికార్డులు నమోదవుతున్నాయంటున్నారు విషయం తెలిసిన నెటిజన్లు. ప్రజలు కూడా వారికి సహకరించి రెండు డోసులు వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఏపీలో కరోనా తాజా వివరాలు ఇలా ఉన్నాయి…

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 55,323 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,246 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2044490కి చేరింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14118 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,450 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2016837కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13535 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,79,80,792  శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Also Read: జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో

రాజకీయాలకు టీడీపీ ఎంపీ కేశినేని గుడ్‌బై..! అధినేత చంద్రబాబుకు సమాచారం