Jana Ashirwad Yatra: బీజేపీ చెప్పిందే చేస్తోంది.. విజయవాడలో జన ఆశీర్వాద సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు.

Jana Ashirwad Yatra: బీజేపీ చెప్పిందే చేస్తోంది.. విజయవాడలో జన ఆశీర్వాద సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy

Edited By:

Updated on: Aug 19, 2021 | 2:53 PM

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు. 370 ఆర్టికల్ రద్దు చేశామన్నారు. చైనా ఎన్ని కుట్రలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొడుతోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు. మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేదన్నారు.

దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలన్నారు. దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారన్నారు. సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని, వీరసతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు. సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని, దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తిరుమల దర్శనం…

గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వెళ్లారు. రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు.

తెలంగాణలో జన ఆశీర్వాద యాత్ర..

తెలంగాణా రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నేటి సాయంత్రం నుండే తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. కోదాడ నుండి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక ఏపీలో తిరుపతి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలలో కిషన్ రెడ్డి పర్యటిస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు పార్లమెంటు నియోజకవర్గాలలో కిషన్ రెడ్డి పర్యటన సాగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లడానికి, కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రజల్లో సానుకూల దృక్పధాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్న క్రమంలో, కిషన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాలలో పర్యటనతో రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..