Vizag: ఇన్‌స్టాలో దర్శనమిచ్చిన యువతి ‘నగ్నచిత్రం’.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

| Edited By: Ravi Kiran

Dec 15, 2023 | 1:28 PM

సాధారణంగా యువతులు, మహిళలను పురుషులు వేధించడం చూసాం. తాను అనుకున్నది జరగకపోతే.. సోషల్ మీడియాలో ఆమె పట్ల తప్పుడు ప్రచారాలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలు పోస్టులు చేయడం వంటి అనేక ఘటనలు ఉన్నాయి. కానీ, మీకు చెప్పబోయే ఈ ఘటన కాస్త డిఫరెంట్.

Vizag: ఇన్‌స్టాలో దర్శనమిచ్చిన యువతి నగ్నచిత్రం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!
Instagram
Follow us on

సాధారణంగా యువతులు, మహిళలను పురుషులు వేధించడం చూసాం. తాను అనుకున్నది జరగకపోతే.. సోషల్ మీడియాలో ఆమె పట్ల తప్పుడు ప్రచారాలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలు పోస్టులు చేయడం వంటి అనేక ఘటనలు ఉన్నాయి. కానీ, మీకు చెప్పబోయే ఈ ఘటన కాస్త డిఫరెంట్. అమ్మాయి పట్ల మరో యువతి విలన్‌గా మారింది. నమ్మశక్యంగా లేదు కదూ..? విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకూ అలాగే అనిపించింది. తీరా విషయం చూస్తే.. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనల మాదిరిగానే.. విశాఖకు చెందిన ఓ యువతి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమయ్యాయి. తనకు తెలియకుండా..! ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా కనిపించడంతో ఒక్కసారిగా ఆమె ఆవాక్కయింది. తీవ్ర ఆందోళనతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగారు. ఎవడో యువకుడే ఈ పని చేసి ఉంటాడని మొదటగా అనుమానించారు పోలీసులు. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చూస్తే.. న్యూడ్ ఫోటోలు షేర్ చేసింది యువకుడు కాదు.. మరో యువతి అని తెలుసుకున్నారు పోలీసులు. దర్యాప్తు పూర్తయ్యేసరికి.. నిందితురాలు యువతి అని తెలియడమే కాకుండా.. పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి.

అసలు విషయం ఇదే..!

అసలు విషయం ఏంటంటే.. నిందితురాలుగా ఉన్న యువతి మెడికల్ ఫీల్డ్‌లో పని చేస్తోంది. అదే ఫీల్డ్‌లో పరిచయం ఉన్న యువకుడితో ఆమె ప్రేమలో పడింది. యువతి, యువకుడు ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి ఆ బాధితురాలు ఎవరనేగా మీ ఆలోచన..? ప్రస్తుతం నిందితురాలు ప్రేమిస్తున్న యువకుడికి మాజీ లవర్. ఏమైందో ఏమోగానీ.. ప్రస్తుతం నిందితురాలుగా ఉన్న యువతకి ఆమె పట్ల జెలసీ పెరిగింది. దీంతో తన బాయ్ ఫ్రెండ్‌కు చెందిన మాజీ లవర్ ఫోటోలను డౌన్లోడ్ చేసి.. మార్ఫింగ్‌తో న్యూడ్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందని గుర్తించారు పోలీసులు. నిందితురాలిని అరెస్ట్ చేశామని అన్నారు సైబర్ క్రైమ్ సీఐ సోమేశ్వరరావు.

మరి కొందరివి కూడా..

ఈ కేసులో నిందితురాలుగా ఉన్న యువతి.. మరో ఇద్దరు మహిళల పట్ల కూడా తప్పుడు ప్రచారం చేసేది. బాధితురాలుగా ఉన్న యువతి తల్లితో పాటు.. ఆమె స్నేహితురాలి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేసింది. ఒక యువతి పట్ల మరో యువతి విలన్‌గా మారడం పోలీసులనే కలవరం పెట్టించింది. ఇటువంటి కేసుల్లో కేవలం అబ్బాయిలే కాదు.. తప్పు చేసినవారు ఎవరైనా.. కచ్చితంగా కేసుల్లో ఇరుక్కోక తప్పదని అంటున్నారు పోలీసులు.