Road Accident: నడి రోడ్డుపై కారు బీభత్సం.. ఇద్దరు యువకుల దుర్మరణం..

|

Nov 04, 2021 | 9:57 PM

Road Accident: నడి రోడ్డుపై కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: నడి రోడ్డుపై కారు బీభత్సం.. ఇద్దరు యువకుల దుర్మరణం..
Road Accident
Follow us on

Road Accident: నడి రోడ్డుపై కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భీకర ప్రమాదం కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం కాపవరం వద్ద చోటు చేసుకుంది. కాపవరం సమీపంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ డెడ్ అయ్యారు. కాగా, అదుపు తప్పి రోడ్డు అవతిలివైపునకు దూసుకెళ్లిన కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు ఉండగా.. స్థానికులు వారిని రక్షించారు. వారిని బయటకు తీయగానే.. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్తప్రికి తరలించారు. మృతులు మొవ్వ మండలం కాజాకు చెందిన కామేశ్వరరెడ్డి(24), మోదుగుమూడి ఉమాకాంత్(20)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి పామర్రు వస్తుంగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కాగా, క్షత్రగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also read:

Harsingar Benefits: పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ఇలా చేస్తే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?

Virat Kohli Dance Video: మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?