Maoist Surrender: ఏపీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 60 మంది లొంగుబాటు.. లొంగిపోయినవారిలో..

|

Jun 28, 2022 | 3:16 PM

ఏఓబీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట 33మంది మావోయిస్టుల లొంగిపోయారు. మరో 27మంది మిలిషియా సభ్యుల సరేండర్ అయ్యారు. వీరితోపాటు ఇద్దరు కీలక మావోయిస్టు నేతలను..

Maoist Surrender: ఏపీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 60 మంది లొంగుబాటు.. లొంగిపోయినవారిలో..
Maoist Surrender
Follow us on

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలోని ఏఓబీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.  అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట 33మంది మావోయిస్టుల లొంగిపోయారు. మరో 27మంది మిలిషియా సభ్యుల సరేండర్ అయ్యారు. వీరితోపాటు ఇద్దరు కీలక మావోయిస్టు నేతలను పోలీసులు అదుపులో ఉన్నట్లుగా సమాచారం. మావోయిస్టు నేతలు పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు అశోక్, శ్రీకాంత్ అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఈ వివరాలను డీఐజీ హరికృష్ణ, ఎస్పీ సతీష్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మాజీ ఎమ్మెల్యే లు కిడారి సర్వేశ్వర రావు, సోమ హత్య కేసు నిందితులు ఉన్నట్లుగా ఎస్పీ సతీష్ తెలిపారు. పెదబయలు, కోరుకోండ దళాలకు చెందిన మావోయిస్టులు, సానుభూతిపరులు ఉన్నారు. ఇదిలావుంటే.. గత పదేళ్లలో ఏకకాలంలో 60మంది లొంగిపోవడం ఇదే తొలిసారి.  భారీగా మావోయిస్టు డంప్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇందులో 39లక్షల నగదు, 9ఎం ఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, వైర్లు, బ్యాటరీలు స్వాదీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు ఎస్పీ సతీష్.

డిఐజీ హరికృష్ణ మాట్లాడుతూ.. అరెస్టైన ఏసీఎం అశోక్ పై రూ. 5లక్షల రివార్డు ఉందన్నారు. లొంగిపియిన మావోయిస్తులపై రూ. 1 లక్ష చొప్పున రివార్డ్ ఉందన్నారు.  పోలీసులు చేపట్టిన సద్భావన యాత్ర, సామాజిక కార్యక్రమాలతో లొంగుబాటు జరుగుతున్నాయన్నారు. క్రమంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోందన్నారు. ఏ సి ఎం అశోక్ పై మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సోమ హత్య కేసుతో పాటు 124 కేసులు ఉన్నట్లుగా తెలిపారు. కోరుకొండ పెదబయలు ఏరియా కమిటీ సెక్రటరీ ( మావోయిస్టు ఏసఎస్ ) వంతల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.  రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయని అన్నారు.

ప్రభుత్వ పథకాలు అభివృద్ధితో లొంగుబాటు జరుగుతున్నాయన్నారు. ఒరిస్సా భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఎస్పీ స్థాయి అధికారి పాడేరులో ఉండటం వల్ల నిఘా మరింత పెరిగిందన్నారు.  లొంగుబాట్లపై భారీగా ప్రభావం చూపిందన్నారు. లొంగిపోయిన దళసభ్యులంధరిపైనా 50కి పైగా కేసులు ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సోమ హత్య కేసుల్లోనూ లొంగిపోయిన వారిలో చాలామంది ఉన్నారని తెలిపారు. ఏఓవి లో మావోయిస్టు కమిటీలు అంటూ ఇప్పుడు ఏమీ లేవని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని డిఐజీ హరికృష్ణ హామీ ఇచ్చారు.

ఏపీ వార్తల కోసం