AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మైనర్లే కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారుగా

పట్టుమని 16 ఏళ్లు ఉన్నాయి. ఈ ఇద్దరు మైనర్ నిందితులు పోలీసుల కళ్లుగప్పి తాళం వేసిన గదిలో నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి ఇక్కడ.

Andhra: మైనర్లే కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారుగా
Andhra News
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 9:04 AM

Share

ఒంగోలు సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌ నుంచి ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లుగప్పి సినీ ఫక్కీలో పరారయ్యారు. పలు బైక్‌లు చోరీ చేసిన కేసుల్లో ఒంగోలు నగరానికి చెందిన ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల దగ్గర నుంచి 5 మోటార్ బైకులు రికవరీ కూడా చేశారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు నిందితులను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. ఒంగోలు సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఆ ఇద్దరు నిందితులు సెంట్రీ కళ్లుగప్పి పరారయ్యారు. పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఎలా పారిపోయారంటే..

పోలీసులు వేసిన తాళాలతోనే బేడీలు విప్పుకుని ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ ఇద్దరు నిందితుల్ని సర్వైలెన్స్ రూంలో ఉండగా పరారైనట్టు గుర్తించారు. ఒంగోలు తాలూకా పీఎస్‌ పరిధిలో పలు బైక్‌ల చోరీల కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. సర్వైలెన్స్ రూమ్‌కి తాళాలు వేసి పక్కనే గోడకు తగిలించి పోలీసులు బయటకు వెళ్లారు. స్టేషన్‌లో ఎవరు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు నిందితులు రూమ్‌లో ఉన్న చీపురు పుల్లలను దారంతో కట్టి గోడకు ఉన్న తాళాలను లాగి తాళాలు తీసుకొని పరారయ్యారు. అనంతరం తాళాలు అక్కడే పారేసి పారిపోయారు. వీరు పారిపోతున్న సమయంలో సెంట్రీగా ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరూ గతంలో గంజాయి సేవిస్తూ చోరీలకు పాల్పడుతున్న నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనతో బిత్తరపోయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Follow Us
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు
ఉద్యోగి పర్సనల్ లైఫ్‌కి స్వీడన్ కంపెనీల రెస్పెక్ట్‌
ఉద్యోగి పర్సనల్ లైఫ్‌కి స్వీడన్ కంపెనీల రెస్పెక్ట్‌
శ్రీరామదాసుగా నాగార్జున నటవిశ్వరూపం.. 20 ఏళ్ల శ్రీరామదాసు
శ్రీరామదాసుగా నాగార్జున నటవిశ్వరూపం.. 20 ఏళ్ల శ్రీరామదాసు
మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ‘దసరా’
మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ‘దసరా’
శుక్రుడు సంచారం.. వారు జాగ్ర‌త్త‌గా ఉండకపోతే.. భారీ నష్టాలు
శుక్రుడు సంచారం.. వారు జాగ్ర‌త్త‌గా ఉండకపోతే.. భారీ నష్టాలు
మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?
మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!
ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!
పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె
పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె