Tuni RTC Driver: మంత్రి అభినందించారు.. ఉద్యోగం ఊడింది.. ఎంత కష్టం వచ్చింది గురూ..!

|

Oct 28, 2024 | 10:25 AM

ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎదుట డ్యాన్స్ చేసిన వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు స్పందించాడు. డ్రైవర్‌ను అభినందిస్తూ ట్విట్ చేశాడు. ఆ తర్వాత డ్రైవర్‌కు ఊహించని షాక్ తగిలింది.

Tuni RTC Driver: మంత్రి అభినందించారు.. ఉద్యోగం ఊడింది.. ఎంత కష్టం వచ్చింది గురూ..!
Tuni Rtc Driver Lost His Jo
Follow us on

కాకినాడ జిల్లా తుని డిపోలో విధులు నిర్వహిస్తున్న లోవరాజు అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్‌గా జాబ్ చేస్తున్నాడు. లోవరాజు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి.. ఈ నేపథ్యంలో తను బస్సు డ్రైవింగ్ చేస్తుండగా రోడ్డు సరిగా లేకపోవడంతో బస్సును ఒక్క దగ్గర ఆపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బస్సులో ఉన్న స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేయాలని లోవరాజును కోరారు. పిల్లల కొరికను కాదనలేక డ్రైవర్ బస్సు ఎదుట చిందులు వేశాడు. డ్యాన్స్ చేసున్నప్పుడు పిల్లలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు స్పందించాడు.’డాన్స్ సూపర్ బ్రదర్! ఇలానే కొనసాగించు! బస్సు ప్రయాణికులు నీ డ్యాన్స్ చూసి ఆస్వాదించినట్లు భావిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. అయితే అంతబాగానే ఉంది అని అనుకునే లోపే ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మంత్రి లోకేష్ అభినందించిన ట్విట్ ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి