మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం. ప్రారంభించనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జల్లు స్నానంతో పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వరకు విమానంలో, అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో, అక్కడినుంచి తుంగభద్రా నది వరకు కార్ లో రానున్న ముఖ్యమంత్రి..పుష్కర స్నానం అయిన వెంటనే తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు. 12 రోజులపాటు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం […]

  • Venkata Narayana
  • Publish Date - 8:13 am, Fri, 20 November 20
మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం. ప్రారంభించనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జల్లు స్నానంతో పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వరకు విమానంలో, అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో, అక్కడినుంచి తుంగభద్రా నది వరకు కార్ లో రానున్న ముఖ్యమంత్రి..పుష్కర స్నానం అయిన వెంటనే తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు. 12 రోజులపాటు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉదయం 6 నుంచి సా 5గంటల వరకే పుష్కరాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్దులు పుష్కరాలకు రావొద్దని సూచించింది. కర్నూలులో పుష్కరాల కోసం 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. అటు మంత్రాలయంలోనూ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేలా ప్రత్యేక బృందాలు రెడీ చేశారు. కరోనా నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే ఘాట్లలోకి అనుమతి ఇస్తున్నారు.