తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కుటుంబంతో సహా చూడాలని కలలు కంటారు. ఇందు కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. టీటీడీ వీడుదల చేసే టికెట్లు కోసం ఎప్పుటి నుంచో వెయిట్ చేస్తుంటారు. కానీ కొంత మందికి టిక్కెట్లు దొరకవు. అలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన కొందరు కేటుగాళ్లు.. భక్తులను దోచుకుంటున్నారు. టికెట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ వేదికగా టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్ల అమ్మకం వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా యర్రగుంట్లలో షేక్ మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
యర్రగుంట్లలో షేక్ మహ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ RIZ ఇంటర్ నెట్ పేరుతో ఆన్ లైన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా జేబు నింపుకుంటున్నాడు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందుతుడిని గుర్తించి, తిరుమలకు తీసుకొచ్చారు. అతనిపై చీటింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..