Bhaskar Naidu Health Update: తిరుపతి(Tirupati)లో ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ (TTD Snake Catcher) భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీటీడీ స్పందించింది. భాస్కర్‌నాయుడుకు మెరుగైన వైద్యసహాయం అందిస్తున్నామని…. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. తాము భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.. అవన్నీ అబద్ధాలు అంటూ టీటీడీ ఖండించింది.
భాస్కర్‌నాయుడు పాముకాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట స్విమ్స్‌లో వైద్యం అందించామని తెలిపింది. అయితే పాముకాటుతోపాటు భాస్కర నాయుడుకి ఇతర సమస్యలు తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించామని పేర్కొంది.
టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఎప్పటికప్పుడు భాస్కర్ నాయుడు పరిస్థితిని తెలుసుకుని వైద్యానికి అవసరమైన సహాయం అందిస్తున్నారు. భాస్కర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని టీటీడీ డాక్టర్లు ఆరా తీస్తూ వైద్యసేవలను సమీక్షిస్తున్నారని టీటీడీతెలిపింది.
టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ ఇప్పటికే రిటైరైనప్పటికీ టీటీడీ అధికారులు భాస్కర్ నాయుడు సేవలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: మాఘమాసం విశిష్టత.. స్నానానికి ఆదివారం పూజకు ప్రాముఖ్యత.. ఈ మాసంలో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదంటే..