తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తుల కోసం తాజాగా మరో ఫుడ్ కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఎసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీటి సరసన మరో ఫుడ్ కౌంటర్‌ను అదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీ భైర్మన్ వైవి. సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే పీఎసీ-1 వద్ద కొత్త ఫుడ్ కౌంటర్‌ను ప్రారంభించారు.
టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కొత్త ఫుడ్ కౌంటర్‌తో తిరుమలలో మొత్తం ఫుడ్ కౌంటర్ల సంఖ్య మూడుకు చేరాయి.
ఇదిలా ఉంటే వారాంతం కావడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారిని 72,631 మంది భక్తులు దర్శించుకోగా 38,529 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లుగా నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..