Tirumala: కొండపై పాలిటిక్స్‌కి నో.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్

| Edited By: Velpula Bharath Rao

Dec 20, 2024 | 1:05 PM

టీటీడీ తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు చోటు లేదంటుంది. రాజకీయ నాయకులు తిరుపతి వచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని టీటీడీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని టీటీడీ ముక్తకంఠతో చెబుతుంది.

Tirumala: కొండపై పాలిటిక్స్‌కి నో.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్
Tirumala
Follow us on

తిరుమల వెంకన్న క్షేత్రంలో పాలిటిక్స్‌కు టీటీడీ నో ఛాన్స్ అంటోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే పొలిటికల్ లీడర్ల కామెంట్స్ పట్ల టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ సహించేది లేదంటోంది . ఈ మేరకు ఛైర్మన్ బీఆర్ నాయుడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రం, ఇది రాజకీయ వేదిక కారాదని పేర్కొన్నారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకుంటే చర్యలు తప్పవన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే తొలి పాలక మండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.

టీటీడీ బోర్డులో ఎజెండాగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించమన్నారు. నిన్న తిరుమల శ్రీవారి దర్శించుకున్న తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి కామెంట్స్‌పై స్పందించారు. తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న టీటీడీ ఈ మేరకు చర్యలు తీసుకునేలా విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి