AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే..

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగినట్లుంది అనే సామెతను నిజం చేస్తూ, ఒకరి కష్టాన్ని చూసి జాలిపడాల్సింది పోయి, ఉచితంగా దొరుకుతున్నాయనే స్వార్థంతో జనం మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకవైపు ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన రైతు, లారీ యజమాని రోదిస్తుంటే.. మరోవైపు జనం మాత్రం రోడ్డుపై పడిన టమాటాలను ఏరుకోవడానికి పోటీ పడ్డారు.

టమాటా లారీ బోల్తా.. మానవత్వాన్ని మరిచి ఎగబడ్డ జనం! ఆ దృశ్యాలు చూస్తే..
Tomato Lorry Overturns
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 9:08 PM

Share

ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు వద్ద టమాటా లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. బద్వేలు నుండి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేలు నుండి భారీ టమాటా లోడుతో విజయవాడకు వెళ్తున్న ఒక లారీ, మార్కాపురం ప్రాంతంలోని పామూరు మండలం మోపాడు సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా అదుపుతప్పింది. దారి మధ్యలో లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్‌తో పాటు సరుకు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనంలో ఉన్న డ్రైవర్ మరియు క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

లారీ బోల్తా పడటంతో అందులోని వందలాది టమాటా క్రేట్లు రోడ్డుపై, పక్కనే ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. టమోటా సరుకు అంతా రోడ్డు పాలు కావడంతో రైతుకు, వాహనం దెబ్బతినడంతో లారీ యజమానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. అయితే, ప్రమాద తీవ్రతను చూసి డ్రైవర్, క్లీనర్‌లను రక్షించాల్సిన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు.

వీడియో ఇక్కడ చూడండి..

రోడ్డుపై టమాటాలు పడి ఉన్నాయన్న విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రజలు బ్యాగులు, కవర్లు, గంపలతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఫ్రీగా వస్తున్నాయన్న ఏకైక కారణంతో కింద పడ్డ టమాటాలను పోటీ పడి మరీ ఏరుకెళ్లారు. క్షతగాత్రుల పరిస్థితి కానీ, నష్టపోయిన రైతు బాధ కానీ ఏమాత్రం పట్టించుకోకుండా జనం ఇలా ఎగబడటం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్! ఫిక్కీ వేదికగా సీఎం రేవంత్ కీలక హామీలు
సీబీఎస్సీ టెన్త్‌ సెకండ్‌ బోర్డు ఫలితాలు.. ఇలా తనిఖీ చేసుకోండి..!
సీబీఎస్సీ టెన్త్‌ సెకండ్‌ బోర్డు ఫలితాలు.. ఇలా తనిఖీ చేసుకోండి..!
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు నల్లగొండ పోలీసుల చెక్..
వెచ్చని రక్తాన్ని పసిగట్టే పాము.. దీని వేటాడే స్టైలే వేరు!
వెచ్చని రక్తాన్ని పసిగట్టే పాము.. దీని వేటాడే స్టైలే వేరు!
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా? వాస్తు చెప్పేది ఇదే
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా? వాస్తు చెప్పేది ఇదే
కోటీశ్వరుడైన రచయిత కళ్లు తెరిపించిన భారతీయుడి బోధన
కోటీశ్వరుడైన రచయిత కళ్లు తెరిపించిన భారతీయుడి బోధన
వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాటరీ, ఫీచర్ల వివరాలు
వివో నుంచి మరో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. బ్యాటరీ, ఫీచర్ల వివరాలు
మధ్యతరగతి వారు చేసే భయంకరమైన ఆర్థిక తప్పులు ఇవే!
మధ్యతరగతి వారు చేసే భయంకరమైన ఆర్థిక తప్పులు ఇవే!
వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి..
వాట్సాప్‌లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ వెంటనే ఆన్ చేసుకోండి..
షుగర్, బెల్లం లేకుండా పిల్లల్లో తెలివితేటలు పెంచే లడ్డు
షుగర్, బెల్లం లేకుండా పిల్లల్లో తెలివితేటలు పెంచే లడ్డు