Andhra News: ఏలూరు ఏజెన్సీ వాసులును వణికిస్తున్న అడవి పందులు.. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది

అడవిలో నివసించే గిరిజనలు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే వారు వణ్యప్రాణులతో ఎంతో స్నేహింగా కూడా మెలుగుతారు. అప్పుడప్పుడు వాటిని రక్షిస్తారు కూడా. కానీ కొన్ని సార్లు వాటి చేతుల్లోనే ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. పశువులను మెపుకొని ఇంటికొస్తున్న ఒక గిరిజనురాలిపై అడవి పంది దాడి చేసింది.దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Andhra News: ఏలూరు ఏజెన్సీ వాసులును వణికిస్తున్న అడవి పందులు.. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది
Andhra News

Edited By: Anand T

Updated on: Nov 04, 2025 | 6:39 PM

అడవిలో నివసించే జనాలు తమతో జీవించే ప్రాణులను ఎంతో స్నేహింగా మెలుగుతారు. అయితే ప్రమాదవశాత్తు కొన్నిసార్లు వాటి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాగాజా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మారుమూల గిరిజన పల్లె చింతలపాడు చెందిన సోడే బుల్లెమ్మ, మరో వ్యక్తి పశువులను మేపుకుని ఇంటికి వస్తున్నారు. అదే సమయంలో పొదల్లో నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా బుల్లెమ్మను ఢీ కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాసేపటికే బుల్లెమ్మ ప్రాణాలు కూడా వదిలేసింది. దీంతో భయాందోళనకు గురైన మరో వ్యక్తి చెట్టు ఎక్కి తన ప్రాణాలు దక్కించుకున్నాడు.

ఇక అక్కడి నుంచి అడవి పంది వెళ్లి పోయాక చెట్టుపై నుంచి దిగిన ఆ వ్యక్తి వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. గత అక్టోబర్ నెలలో గుట్టచిగురు మామిడి కి చెందిన సత్యం అడవిలో పశువుల ను లేపటానికి వెళ్లిన సమయంలో అడవి పంది దాడి చేసింది. ఘటనలో అతడి కాలు, తొడ ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అదేసమయంలో పెంపుడుకుక్కలు అలెర్ట్ అయి పందిరిపై విరుచుకుపడటంతో అది పరారైంది.‌

ఇలా వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు గిరిజనులకు రక్షణ కల్పించాలని పలువు కోరుతున్నారు. అడవిలో పులులు, పాములు, కొండ గొర్రెలు, అడవి దున్నలు మనుషులపై దాడి చేస్తాయి . కాని ఇపుడు ఏలూరు ఏజెన్సీ లో అడవి పందులు మనుషులకు ప్రాణభయం పుట్టిస్తున్నాయి. మరో ఫారెస్ట్ అధికారులు మేల్కొంటారో లేదో..?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.