Andhra Pradesh: ఊరు చివర నుంచి రాత్రి పూట చప్పుళ్లు.. పొద్దున్నే వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

|

Mar 12, 2022 | 1:15 PM

దురాశ దు:ఖానికి చేటు. ఈ విషయం ఎవరూ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. కానీ కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు. కలలతో ఆగిపోవడం లేదు

Andhra Pradesh: ఊరు చివర నుంచి రాత్రి పూట చప్పుళ్లు.. పొద్దున్నే వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్
Treasure Hunt
Follow us on

Kurnool District:  దురాశ దు:ఖానికి చేటు. ఈ విషయం ఎవరూ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. కానీ కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు. కలలతో ఆగిపోవడం లేదు… అందుకు రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ మధ్య సంపద కొల్లగొట్టడానికి చాలామంది ఫాలో అవుతోన్న షార్ట్ కట్ గుప్త నిధుల కోసం తవ్వకాలు. అవును.. ఈ మధ్య నిధుల కోసం పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాంతాలు.. ఆఖరికి స్మశానాలు కూడా వదలడం లేదు దుండగులు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం(Pattikonda Mandal) రాజులమండగిరి గ్రామ సమీపంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు.  రాజులమండగిరి గ్రామ సమీపంలో పురాతన విగ్రహం బుగలఅమ్మ గ్రామ దేవత విగ్రహాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం వేట సాగించారు.  ఈ విగ్రహం కింద భూభాగంలో గుప్తనిధులున్నాయని ప్రచారం జరగడంతో గుర్తుతెలియని వ్యక్తులు వీటికోసం తవ్వకాలకు పాల్పడుతున్నారు.  దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో అంతా వచ్చి ఆ గోతులను పరిశీలిస్తున్నారు. తవ్వకాల్లో ఏదో ఒకటి దుండగులు ఎత్తుకెళ్లే ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గుప్త నిధుల పేరుతో ఇలా గుడులు, గోపురాల ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే