Vizag: రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిపర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా..

అది విశాఖ రైల్వే స్టేషన్.. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసు నార్కోటిక్స్ డాగ్స్‌తో తనిఖీలు చేస్తోంది స్పెషల్ టీం.. స్నిఫర్ డాగ్‌ సీజర్‌ను కూడా రంగంలోకి దించింది పోలీస్ బృందం.. వెళ్తూ వెళ్తూ అది ఓచోట ఆగిపోయింది. పోలీసులు ఎంత పిలుస్తున్న అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు ఆ పోలీస్ జాగిలం సీజర్. అనుమానం వచ్చి తనిఖీలు చేస్తే..

Vizag: రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిపర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా..
Sniffer Dog
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 13, 2024 | 3:16 PM

అది విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే రైళ్లతో స్టేషన్ అంతా బిజీబిజీగా ఉంది.. ప్రయాణికులతో సందడిగా మారింది.. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వన్ వద్ద ప్రయాణికుల హడావిడి కూడా ఉంది. ఈ సమయంలో నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. వెళుతూ వెళుతూ.. ఆ పోలీసు జాగిలం ఒక్కసారిగా ఆగింది. ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు.. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు అక్కడ చెక్ చేశారు.. ఇంకేముంది గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ జరిగిపోతోంది. డాగ్ చాకచక్యంతో ఆ గుట్టు బయటపడింది. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తదుపరి చర్యల కోసం రైల్వే పోలీసులకు అప్పగించారు. తనిఖీలు చేపట్టి గంజాయి గుర్తించిన నార్కో టిక్ స్నిఫర్ డాగ్ సీజ‌ర్‌ను.. డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్‌ను అభినందించారు సిపి బాగ్చి. ఈ మధ్యకాలంలో సీజర్ రైల్వేస్టేషన్లో గంజాయిని పట్టుకోవడం ఇది రెండోసారి.

హోం మంత్రి ప్రశంసలు..

రైల్వే స్టేషన్ లో 30 కిలోల గంజాయి గుర్తించిన నార్కోటిక్ డాగ్ సీజర్ హోం మంత్రి నుంచి ప్రశంసలు అందుకుంది. ఎక్స్ వేదికగా డాగ్ సీజర్‌తో పాటు పోలీస్ టీంను అభినందించారు హోంమంత్రి అనిత. గంజాయిని కంట్రోల్ చేసేందుకు సీపీ చేపడుతున్న కార్యకలాపాలకు హోం మంత్రి ప్రశంసించారు.

‘మాదకద్రవ్యాల నిర్వీర్యం లక్ష్యంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ చేస్తున్న కృషికి అభినందనలు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో నాలుగవ పట్టణ పోలీస్‌లు, డాగ్ హ్యాండ్లర్ రామ్ ప్రసాద్, నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహకారంతో 30కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా అధికార యంత్రాంగం సహకారంంతో త్వరలో అందుబాటులోకి రాబోయే మరో 8 స్నిఫర్ డాగ్స్ ద్వారా గంజాయి ప్రక్షాళన చేయడంలో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుతున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు హోం మంత్రి అనిత.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!