
కడప, సెప్టెంబర్ 8: నిత్యం ప్రమాదాలకు కారణమయ్యే ఆ ఘాట్ లో ప్రమాదాలను అరికట్టడం రమణా శాఖకు.. ఇటు పోలీసులకు ఒక పెద్ద టాస్క్ గా మారింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అక్కడ.. అలాంటి ప్రమాదమే మరొకటి జరిగింది. ఈసారి లారీ లోయలోకి దూసుకుపోయి మంటలు చెలరేగి ఆ మంటలలో ఇద్దరు సజీవ దానమయ్యారు.
ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన గువ్వల చెరువు ఘాట్ నిత్యం ప్రమాదాలకు నిలయం.. ప్రస్తుతం ఆ ఘాట్ కడప, అన్నమయ్య జిల్లాలకు సరిహద్దు ప్రాంతం.. దాదాపు పది మలుపులు ఉండే ఆ ఘాట్ లో ఏదో ఒక మలుపు వద్ద ప్రతిరోజు ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. లారీలు బ్రేకులు పడక లోయలోకి వెళ్లిపోవడం, మలుపుల దగ్గర బ్రేకులు పడక ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనడం అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం రాయచోటి నుంచి కడపకు వస్తున్న సిమెంట్ లారీ ఘాట్ ఎక్కి కిందకు దిగుతుండగా హఠాత్తుగా లోయలో పడిపోయింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించడం ఆ మంటలు పెద్దవిగా అలుముకోవడం లారీలో ఉన్న డ్రైవర్ , క్లీనర్ ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోవడం కనురెప్ప పాటులో జరిగాయి.
అంతేకాకుండా ఘాట్ లోయలోని అటవీ ప్రాంతమంతా తగలబడడం జరిగింది ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోపే ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఈ ఘాట్ లో లైట్లు కానీ ప్రమాద సూచికలు గాని, ఇక్కడ మలుపు ఉన్నది అనే రేడియం స్టిక్కర్ బోర్డులు గాని, స్పీడ్ బ్రేకర్ల వద్ద ఇండికేషన్స్ కానీ ఏమీ ఉండవు. వాహనానికి సంబంధించిన లైట్లు మినహా ఎక్కడ మలుపు ఉంది అని తెలుసుకోవడానికి ఏ మాత్రం సూచికలు లేకపోవడం వల్లనే.. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటినుంచో గువ్వలచెరువు ఘాట్ వద్ద టన్నల్ ఏర్పాటు చేయాలని కేంద్రం అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు పనులు పూర్తికాలేదు. ఆ పనులు ప్రారంభమై టన్నల్ ఏర్పాటు అయితే ఈ ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.