Andhra: పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా ఘోరం.. కుక్క రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పాపం ముగ్గురు..

Bapatla Road Accident:  ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.. ఈ ఘోర ప్రమాదం బాపట్ల మార్టూరు మండలం కోలలపూడి దగ్గర హైవేపై చోటుచేసుకుంది.

Andhra: పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా ఘోరం.. కుక్క రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పాపం ముగ్గురు..
Road Accident

Updated on: Sep 21, 2025 | 9:39 AM

Andhra Road Accident:  ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.. ఈ ఘోర ప్రమాదం బాపట్ల మార్టూరు మండలం కోలలపూడి దగ్గర హైవేపై చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి కారు.. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు దామర్ల లక్ష్మణ్ (70), భార్య సుబ్బాయమ్మ (65), మనవడు హేమంత్ (25) గా పోలీసులు తెలిపారు.

వీరంతా తిరుపతి నుండి పిఠాపురం దేవాలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే.. కుక్కను తప్పించబోయి అదుపుతప్పి కారు బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..