Andhra Pradesh: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి దుర్మరణం

|

Feb 07, 2022 | 11:27 AM

Rooster fight: కోడిపందాల్లో కోడిపుంజు కాలికి కట్టే కత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. వాటిని నిపుణులైన వ్యక్తులతో మాత్రమే కోడి కాళ్లకు కట్టిస్తుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర గాయాలపాలవుతారు.

Andhra Pradesh: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి దుర్మరణం
Cockfighting
Follow us on

Cockfighting: కోడి కత్తి పొడుచుకుని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ విచిత్రమైన ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District) పెద్దమండ్యం మండలం(Peddamandyam Mandal) నిప్పువనంలో జరిగింది. స్థానికంగా ఉన్న కలిచెర్ల పోలేరమ్మ గుడి సమీపంలో కోడిపందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులకు వెళ్లారు. పోలీసులను చూసి పందె రాయుళ్లు పరారయ్యారు. వెళ్తూవెళ్తూ కోళ్లను పట్టుకుని వెళ్లాలన్న హడావిడిలో ఓ వ్యక్తికి కోడి కత్తి పొడుచుకుంది. పదునెక్కిన ఆ కత్తి పొడుచుకుందో లేదో.. రక్తం ధారకట్టింది. గాయపడ్డ వ్యక్తిని ముదివేడుకు చెందిన గంగులయ్యగా గుర్తించారు. కాగా అతడిని వెంటనే లోకల్ PHCకి తరలించినా.. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. సాదాసీదా కేసు కింద ఈ కోడిపందాలకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల భయంతో పరుగులు తీసి గంగులయ్య చనిపోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. సాధారణంగా కోడిపందాల్లో కోడిపుంజు కాలికి కట్టే కత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. వాటిని నిపుణులైన వ్యక్తులతో మాత్రమే కోడి కాళ్లకు కట్టిస్తుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర గాయాలపాలవుతారు. కోడి కత్తి తగిలితే తీవ్ర రక్తస్రావమవుతుంది.  అందుకే కోడి పందాలు జరిగేటప్పుడు బరుల్లోకి ఎవర్నీ రానివ్వరు.

కాగా మాములుగా అయితే సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కోడి పందేలు నిర్వహించడం.. అపై ఊహించని రీతిలో ఓ వ్యక్తి కోడి కత్తి తగిలి మరణించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..