బ్రేకింగ్: లోయలో పడ్డ బస్సు.. పది మంది దుర్మరణం

| Edited By:

Oct 15, 2019 | 1:55 PM

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా మధ్యదారిలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పర్యావేక్షిస్తున్నారు. కాగా.. ప్రయాణికులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు బయలు దేరిన కొద్ది […]

బ్రేకింగ్: లోయలో పడ్డ బస్సు.. పది మంది దుర్మరణం
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా మధ్యదారిలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పర్యావేక్షిస్తున్నారు. కాగా.. ప్రయాణికులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బస్సు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు బయలు దేరిన కొద్ది సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో.. బస్సు అదుపుతప్పి లోయలో పడింది. అందులోనూ టూరిస్ట్ స్పాట్ కావడంతో.. అక్కడికి పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

రహదారి.. ప్రమాదకరం:
మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.