Tomato Price: కనీస మద్దతు ధర లేక కన్నీరు పెడుతోన్న టమాటా రైతు.. మార్కెట్ లో కిలో రూపాయి నుంచి రూ.3..

|

Nov 18, 2022 | 4:36 PM

టమోటా రైతు అన్ని కష్టాలు దాటుకొని పంటను మార్కెట్‌కు తెస్తే.. ధర లేక తెల్లమొఖం వేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన సరుకుకు దారి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా ఆస్పరి కూరగాయల మార్కెట్ లో టమోటా ధర పూర్తి స్థాయిలో పతనమయ్యింది.

Tomato Price: కనీస మద్దతు ధర లేక కన్నీరు పెడుతోన్న టమాటా రైతు.. మార్కెట్ లో కిలో రూపాయి నుంచి రూ.3..
Tomato Price Fall Down
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ టమాటా రైతులు కంట కన్నీరు పెడుతున్నారు. మళ్ళీ టమాటా ధర భారీగా పతనం కావడంతో రైతు నోట్లో మన్నే పడింది. కూరగాయల మార్కెట్ లో టమోటా ధర పూర్తి స్థాయిలో పతనం కావడంతో..  కనీసం తమకు  ట్రాన్స్‌ పోర్టు చార్జీలు కూడా రావడం లేదంటూ టమాటాలు  రోడ్లపైనే పారబోసి వెళ్తున్నారు. మొత్తానికి ఏపీలోని వినియోగ దారులకు టమాటాలు కొనాలంటే…  మంట.. మరోవైపు రైతుల నోట్లో మట్టి అన్నట్టుగా మారింది. అవును ప్రస్తుత రోజుల్లో రూపాయి ఇస్తే.. చిన్న పిల్లలే కాదు.. బిచ్చగాడు కూడా తీసుకునే పరిస్థితి లేదు. అయితే కష్టనష్టాలకోర్చి.. ఆరుగాలం తాము పండించిన పంటకు కనీస ధర కూడా రాకపోవడంతో అన్నదాత నష్టపోతున్నాడు.

టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీలోని టమాటా రైతులు.. నష్టపోతూనే ఉన్నారు. టమోటా రైతు అన్ని కష్టాలు దాటుకొని పంటను మార్కెట్‌కు తెస్తే.. ధర లేక తెల్లమొఖం వేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన సరుకుకు దారి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం వరకూ మంచి ధరతో 4 రాళ్లు వెనకేసుకున్న రైతులు.. గత కొన్ని రోజులుగా మార్కెట్ లో ధరలు లేకపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కర్నూలు జిల్లా ఆస్పరి కూరగాయల మార్కెట్ లో టమోటా ధర పూర్తి స్థాయిలో పతనమయ్యింది.  కిలో టమాటా ధర ఒక రూపాయ నుంచి మూడు రూపాయలకు పలుకుతోంది. అయినప్పటికీ మార్కెట్ లో సరుకును కనీసం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి ఉంది.

ఇవి కూడా చదవండి

వ్యాపారులు పెడుతున్న ధరలను చూసి రైతుల కండుపు మండి పోతోంది. రవాణా ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో మార్కెట్ లో టమోటా లను రోడ్డు మీదనే పారబోసి వెళ్తున్నారు రైతులు. కనీస మద్దతు ధర కోసం దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..