Today tomato price: ధర ఆకాశానికి ఎగబాకాలన్నా అదే.. అద: పాతాళానికి పడిపోవాలన్నా అదే. ఇంకేంటిటమాటా. అవును.. ప్రజంట్ ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమోటా రేటు..ఇప్పుడు ఉన్నఫలంగా ఢమాల్ మంది. అనంతపురం(Anantapur), కర్నూలు(Kurnool) జిల్లాల్లో భారీగా పడిపోయాయి టమాటా ధరలు. అనంతపురంలో 15 కిలోల టమాటా బాక్సు..కేవలం 60రూపాయలలోపే ధర పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట టమాటాలు పారబోసి నిరసన తెలిపారు. ఇక కర్నూలులోనూ భారీగా పతనమైంది టమాటా ధర. రైతుల నుంచి 30కిలోల బాక్సును 40రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. వినియోగదారులకు మాత్రం 10 నుంచి 14 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో ఆరుగాలం శ్రమించినా పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మార్కెట్లకు లోడ్ల కొద్దీ టమోటా రావడంతో ధరలు పడిపోయాయి. దీంతో మార్కెట్‌కు తీసుకురావడం కూడా వృథా అని భావించి రోడ్లపైనే పారబోస్తున్నారు రైతులు. కనీస మద్దతు ధర ఉండేలా.. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బు అయినా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..