తస్సాదియ్యా.. ఆ ఏటీఏంలో ఓ వ్యక్తి రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. దీంతో.. అతను తెలిసినవాళ్లకి కూడా ఈ విషయం చెప్పాడు. వారు కూడా వచ్చి ఏటీఏం నుంచి నగదు తీసేందుకు పోటీ పడ్డారు. నిమిషాల వ్యవధిలో విషయం పట్టణం అంతా పాకింది. దీంతో డబ్బు కోసం జనం పోటెత్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ ఘటన జరిగింది. దీంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బ్యాంకు సిబ్బందితో వచ్చి.. సదరు ఏటీఎం సెంటర్‌ను క్లోజ్ చేయించారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆపై సమస్యను క్లియర్ చేసి… మళ్లీ ఏటీఎంను యధావిధిగా ఓపెన్ చేశారు. అందులో నుంచి ఎంత నగదు ఎక్కువగా బయటకు వెళ్లిందో తేలాల్సి ఉంది.
ఏటీఎంలో చోరీకి యత్నం..
మరోవైపు ఏపీలోని కడప జిల్లా ఖాజీపేటలోని SBI ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు . బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏటీఎంలోకి ప్రవేశించి.. సీసీ కెమెరాలకు స్టిక్కర్లు అంటించారు. ఆపై మిషన్ ముందు భాగం తొలగించడంతో అలారం మోగింది. దీంతో దుండగులు పరారయ్యారు. బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చిన పోలీసులు వెంటనే ఏటీఎం గదిని పరిశీలించి.. ఎలాంటి నగదు అపహరణ గురి కాలేదని నిర్ధారించుకున్నారు. దుండగుడు చోరీకి ప్రయత్నించిన AP39 DQ7371 బైక్‌ను సీజ్ చేశారు. బైక్ నంబర్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడ్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..