Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 22న అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

|

Aug 18, 2022 | 8:51 PM

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆరోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు..

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 22న అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Tirumala
Follow us on

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆరోజు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌  ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసోవద్దని హెచ్చరించింది.

కాగా సెప్టెంబర్‌ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కాగా ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా  బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఈక్రమంలో బ్రహ్మోత్సవాల రోజుల్లో అంగప్రదక్షిణ టోకెన్లను కూడా రద్దు చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..