AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. ఉచిత బస్సులన్నీ..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఇక నుంచి తిరుమలలో నడిచే ఉచిత ధర్మరథం బస్సు టైమింగ్స్ సులువుగా తెలుసుకోవచ్చు. మీరు దిగాల్సిన ప్రాంతానికి ఎప్పుడు చేరుకుంటుందనే వివరాలు కూడా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొస్తుంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. ఉచిత బస్సులన్నీ..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Sep 26, 2026 | 3:57 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమలలో స్మార్ట్ బస్టాప్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ బస్టాపుల్లో తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఉచిత బస్సుల సమాచారం, వివరాలను తెలియజేయనుంది. బస్టాపుల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటిని స్కాన్ చేస్తే ఉచిత విద్యుత్ బస్సుల వివరాలు, సమాచారం మొత్తం వచ్చేలా టీటీడీ ఏర్పాటు చేసింది. బస్సు ఏ సమయానికి వస్తుంది.. ? ఎక్కడెక్కడ ఆగుతుంది..? ఎంత దూరంలో ఉంది? అనే వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. దీని వల్ల బస్సుల కోసం వెయిటింగ్ చేసే శ్రమ భక్తులకు తగ్గుతుంది. ప్రతీ మూడు నిమిషాలకు ఒక బస్సు ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీని వల్ల భక్తులకు వెయిటింగ్ సమయం తగ్గుతుంది.

ఇటీవల రిలయన్స్, భారత్ బయోటెక్ సంస్థలు టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించాయి. ఈ బస్సులను ధర్మరథం పేరుతో భక్తుల కోసం ఉచితంగా నడుపుతున్నారు. ఈ బస్సుల్లో శ్రీవారి భక్తులు తిరుమలలో ఉచితంగా ఒకచోట నుంచి మరోచోటకు ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు ఈ బస్సుల వివరాలు భక్తులకు సలువుగా తెలిసేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం స్మార్ట్ ఆలోచన చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా భక్తులు బస్సుల టైమింగ్స్ తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఏర్పాట్లు చేయనున్నారు. తిరుమలలోని 20 బస్టాపుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ప్రతీ బస్టాప్‌లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. బస్సు ఏ మార్గంలో తిరుగుతుందనే వివరాలతో పాటు స్టాపులు, ఎంత టైమ్‌లో వస్తుందనే వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బస్సుల సమాచారాన్ని తెలిపేలా ఎలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో బస్సులు ఏ సమయానికి వస్తాయో తెలియక భక్తులు ఎదురుచూస్తున్నారు.

కొన్నిసార్లు బస్సులు రావడంలో ఆలస్యం జరగడం వల్ల ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉచిత బస్సుల సమాచారం సులువుగా భక్తులు తెలుసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ధర్మరథం బస్సుల కోసం బస్టాప్‌లు ఉండగా.. వీటిని స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ ముందడుగు వేసింది. ప్రస్తుతం తిరుమలలో 50 ఎలక్ట్రిక బస్సులు తిరగుతున్నాయి. ఇప్పటివరకు స్టాప్ రాగానే కండక్టర్లు భక్తులను అలర్ట్ చేస్తున్నారు. కానీ కొత్తగా తిరుమలను సందర్శించేవారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకురానున్న స్మార్ట్ టెక్నాలజీతో కొత్తవారు కూడా సులువుగా స్టాపుల వివరాలు తెలుసుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే బస్సు వెళ్లే రూట్‌మ్యాప్‌ కనిపిస్తుంది.  వారు దిగాల్సిన లొకేషన్‌‌పై క్లిక్ చేస్తే గమ్యస్థానానికి బస్సు ఎంత సమయంలో వెళుతుందో కూడా తెలుసుకోవచ్చు.

Follow Us