TTD: ఈ సారి మాఢ వీధుల్లో వాహన సేవలు.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, కానీ ఈ సారి మాడవీధుల్లో వాహన సేవలు ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబరు...

TTD: ఈ సారి మాఢ వీధుల్లో వాహన సేవలు.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
Ttd Eo Dharma Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 10, 2022 | 12:46 PM

తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, కానీ ఈ సారి మాడవీధుల్లో వాహన సేవలు ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబరు 27నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ (CM Jagan) పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తిరుపతిలోని కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను ఎప్పటి నుంచి జారీ చేయాలనే విషయంపై చర్చించి తేదీపై ప్రకటన చేస్తామని చెప్పారు. తిరుమలలో గదులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయన్న ధర్మారెడ్డి.. భక్తులు వీలైనంత వరకు తిరుపతిలో అద్దె గదుల్ని ఉపయోగించుకోవాలని కోరారు. గదులను అద్దెకు ఇచ్చేందుకు యూపీఐ స్కానర్ వంటి డిజిటల్ ప్లాట్ ఫాంలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అంతే కాకుండా కరోనా కారణంగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు.

కాగా.. కలియుగవైకుంఠ వాసుడి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 27నుంచి తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.

అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు (Brahmotsava) ముగిస్తాయని వివరించారు. ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 27న స్వామివారికి పట్టు వస్త్రాలు అందించేందుకు సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక ఇస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ