
తిరుమల శ్రీవారి దర్శననానికి వాహనాల్లో వచ్చే భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పంది. ఈ నూతన విధానం ఆగస్టు 15వ తేదీని నుంచి అమల్లోకి రానుంది టీటీడీ తాజా ప్రకటనలో పేర్కొంది. రోజురోజుకు తిరుమల శ్రీవారికి దర్శనానికి వచ్చే భక్తులు రద్దీ పెరుగుతుండడంతో.. అలిపి చెక్ పోస్ట్ వద్ద వాహననాల రద్దీ కూడా పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ట్యాగ్ లేనీ వాహనాలను మ్యాన్‌వల్‌గా టోల్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై దృష్టి పెట్టిన టీటీడీ వాహనాల్లో తిరుమలకు చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, రద్దీ లేని ప్రయాణం, పారదర్శక సేవలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి తీసుకురానుంది.
టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వచ్చిన వాహనాలు వచ్చినట్టే వెళ్లిపోవడంతో ట్రాఫిక్ జామ్ కూడా తగ్గనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.