Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..

అనంతపురం జిల్లాలో దోపిడి దొంగల ముఠా రెచ్చిపోయింది. గుత్తి వద్ద ఆగి ఉన్న నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లోకి చొరబడిన దొంగలు ప్రయాణికులనుంచి బంగారం, నగదు అపహరించుకొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..
Rayalaseema Express

Updated on: Apr 29, 2025 | 3:00 PM

అనంతపురం జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నిజామాబాద్‌-తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో దొంగతతానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌-తిరుపతి వెళ్తు..అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్‌ చేయడానికి గుత్తి శివారులో ఆగిన ట్రైన్‌లోకి చొరబడి ప్రయాణికులను దోచుకున్నారు. ట్రైన్‌లోని ప్రయాణికులను కత్తులతో బెదిరించి.. వాళ్ల వద్ద నుంచి బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను అపహరించుకొని పరారయ్యారు. సుమారు రైలులోని పది బోగీల్లో దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో నగదు, ఆభరనాలు కోల్పోయిన 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి…

తిరుపతిలో విషాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు మృతి

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్‌ఐజీ భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు, ఘటనా స్థలంలోని మృతదేహాలను పరిశీలించారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్‌, కే.శ్రీనివాసులుగా గుర్తించారు. ఆ తర్వాత ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాళ్లు ప్రమాదవశాత్తు చనిపోయారా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..