
తిరుమల శ్రీవారిని రోజూ లక్ష మంది వరకు దర్శించుకుంటారు. ఇక క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేల మంది స్వామివారి దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక తిరుమల వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దీంతో తిరుమలకు సంబంధించిన ప్రతీ విషయం ముందుగానే తెలసుకోవడం వల్ల స్వామివారి దర్శనం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దర్శనాలు, ఇతర సేవలకు సంబంధించి టీటీడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. వీటిని ప్రకటనల రూపంలో ప్రజలకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయనుంది.
ఈ నెల 25వ తేదీ నుంచి తిరుమలలో రథసస్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల క్రమంలో తిరుమలలో ఈ నెల 24వ తేదీ నుంచి 26 తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే 25వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రోహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లు, పిల్లలు, ఎన్‌ఆర్‌ఐల స్పెషల్ దర్శనాలను రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు బంద్ చేసింది. అలాగే ఈ మూడు రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపియాలని నిర్ణయించారు. రధసప్తమి వేడుకల నిర్వహణపై చర్చించేందుకు అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. శాఖల వారీగా వేడుకల నిర్వహణపై చర్చించారు. రథసప్తమి వేడులకు ఘనంగా జరిగేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు.
ఇక భక్తులకు రథసప్తమి రోజుల్లో మాడ వీధులు, క్యూలైన్లు, బయటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అన్న ప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భక్తుల కోసం 5 లక్షల లడ్డులను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచనున్నారు. తిరుమలలో పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పట్లపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడులను టీటీడీ ఘనంగా జరిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడే అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది పని చేయాలని, అందరూ సమన్వయంగా పనిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయపి టీటీడీ ఈవో స్పష్టం చేశారు. రథసప్తమి వేడుకల సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉన్నందున కొన్ని దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.