
తిరుమల వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ అందించింది. రద్దీకి తగ్గట్లు ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వీటిని నడుపుతూ ఉంటుంది. ఇక పండుగల సమయంలో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ అనే స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తున్న క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో మూడు ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో రెండు రైళ్లు తిరుమలకు వెళ్లనున్నాయి. వాటి వివరాలు ఏంటో చూద్దాం.
డిసెంబర్ 18న మచిలీపట్నం-ఉదానగర్(07291) ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇది సాయంత్రం 21.158 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 09.45కు ఉదానగర్ చేరుకుంటుంది. ఇది గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లొండ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది.
ఇక తిరుపతి-కాచిగూడ(07296) స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 19న సాయంత్రం 19.40 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి తర్వాతి రోజు 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇది రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ఆగుతుంది.
ఇక తిరుపతి-ప్రయోగరాజ్(07298) రైలు డిసెంబర్ 20న ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 4.30 గంటలకు ప్రయోగరాజ్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇది రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, వికారాబాద్, లింగంపల్లతి, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, చంద్రపూర్, భోపాల్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.