Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..

తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్. మరో ప్రత్యేక రైలును ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ప్రవేశపెట్టింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రైన్ టైమింగ్స్, హాల్ట్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వాటి వివరాలు చూద్దాం.

Tirumala: తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..
Tirumala Darshan

Updated on: Jun 24, 2026 | 1:52 PM

ఏపీ, తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక రైలును ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ కారణంగా తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలు టైమ్ షెడ్యూల్‌తో పాటు ఏయే స్టేషన్లలో ఆగుతుందనే వివరాలను రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తిరుపతికి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఇప్పుడు మరొకటి అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రైన్ టైమింగ్స్, ఏయే స్టేషన్లలో ఆగుతుందనే వివరాలు చూద్దాం.

టైమింగ్స్ ఇవే..

చర్లపల్లి-తిరుపతి(07819) గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 25న, 27వ తేదీల్లో సర్వీసులు అందించనుంది. ఇది చర్లపల్లిలో 18.10 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-చర్లపల్లి(07820) రైలు శుక్రవారం, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 26,28వ తేదీల్లో మధ్యాహ్నం 15.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 04.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డొర్నకల్, ఖమ్మం, మధీర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లల్లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.  మొన్నటివరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో తిరుమలలో విపరీతమైన భక్తల రద్దీ ఏర్పడింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనంతరం స్కూళ్లు ప్రారంభం కావడంతో తిరుమలలో రద్దీ తగ్గింది.

Loading...
Unable to load recommendations.
Follow Us