Nara Lokesh : ‘లోకేష్ ఇక్కడ.., జగన్ ఎక్కడ..?’, ఇక్కడికి రండి… ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ ఛాలెంజ్

|

Apr 14, 2021 | 2:23 PM

Nara Lokesh Challenges CM Jagan : తిరుపతిలోని పవిత్ర స్థలమైన అలిపిరి దగ్గర ఇవాళ ఒక రాజకీయ యుద్ధమే జరుగుతోంది...

Nara Lokesh : లోకేష్ ఇక్కడ.., జగన్ ఎక్కడ..?,  ఇక్కడికి రండి... ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ ఛాలెంజ్
Follow us on

Nara Lokesh Challenges CM Jagan : తిరుపతిలోని పవిత్ర స్థలమైన అలిపిరి దగ్గర ఇవాళ ఒక రాజకీయ యుద్ధమే జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాకతో ఆ ప్రాంతమంతా కోలాహల వాతావరణం నెలకొంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సెంట్రిక్ గా టీడీపీ ఛాలెంజ్ లు విసురుతోంది. వివేకా మృతికి కారణం గొడ్డలి పోటా… గుండె పోటా.. అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు, లోకేష్ ఇక్కడ.., జగన్ ఎక్కడ..! అంటూ టీడీపీ నేతలు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అలిపిరి గరుడ విగ్రహం ముందు కార్యకర్తలు నాయకులతో కలిసి నారా లోకేష్ బైఠాయించారు. “వైఎస్ వివేకా హత్య వెనక ఉన్న జగన్ రెడ్డి దమ్ము దైర్యం ఉంటే అలిపిరికి రావాలి. వైసీపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా జగన్ ను అలిపిరికి తీసుకురావాలి. వివేకా హత్య కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేయటానికి సిద్దంగా ఉన్నాను. వివేకా హత్య తామే చేశామంటు సొంత మీడియాలో ప్రచారం చేసిన జగన్ ఎక్కడ …” అని నారా లోకేష్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

అంతేకాదు, ” నేను అలిపిరిలో ఉన్నా.. జగన్ తాడేపల్లి పాలెస్ నుంచి రాగలరా. 24 నెలలు గడిచింది సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. బాబాయిని హత్య చేసిన వాళ్ళను పట్టుకోవాలని జగన్ కు లేదా.? రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు. నాపైన నిరాధారమైన ఆరోపణలు చేశారు. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. హత్యలో ప్రధాన సూత్రధారులు వై.ఎస్.అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డిలే..” అని లోకేష్ ఆరోపణలు చేశారు. “వివేకానందరెడ్డి కూతురు సునీత కోర్టుకెళ్ళినా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదు. శ్రీవారి పాదాల సాక్షిగా ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దాం. వివేకా హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోతున్నారు.” ఏమిటీ మిస్టరీ అని నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు.

Read also : SP chief Akhilesh Yadav tests COVID-19 positive : మాజీ ముఖ్యమంత్రి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్లో అభ్యర్థన