
Mukesh Ambani Tirumala: నిన్న రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆధునిక వంటగదిని నిర్మించనున్నట్లు చెప్పారు. దీనిని శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌కు అంకితం చేయనున్నారు. ఈ గది ప్రతిరోజూ భక్తులకు 2,00,000 భోజనాన్ని అందించేలా నిర్మిస్తామన్నారు. ఈ వంటగది అధునాతన ఆటోమేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రయత్నం ద్వారా అన్నసేవా సంప్రదాయాన్ని అన్ని టిటిడి దేవాలయాలకు విస్తరించాలనే సీఎం ద్రబాబు నాయుడు గొప్ప దార్శనికతకు తోడ్పడటానికి తాము ఈ ప్రయత్నంలో భాగంగా ఉన్నామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆదివారం బిలియనీర్ ముఖేష్ అంబానీ తిరుమలను సందర్శించారు. అలాగే కేరళలోని త్రిస్సూర్ ఆలయ పట్టణంలో ఉన్న గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం పొందారు. అక్కడ ఆయన రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త చెబుతున్న బంగారం ధరలు.. తలం ధర ఎంతంటే..
VIDEO | Tirumala: Reliance Group Chairman Mukesh Ambani offers prayers at Lord Venkateswara Temple in Tirumala.#MukeshAmbani #Tirumala #LordVenkateswara
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/cVVAXxmA7S
— Press Trust of India (@PTI_News) November 9, 2025
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి