Chandrababu : మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో మామిడి రైతుల్ని దగా చేస్తోన్న గుజ్జు పరిశ్రమలు : చంద్రబాబు

|

Jun 25, 2021 | 7:53 AM

మామిడి రైతుల్నిమంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలోని సిండికేట్లు నిట్టనిలువునా దగా చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు...

Chandrababu : మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో మామిడి రైతుల్ని దగా చేస్తోన్న గుజ్జు పరిశ్రమలు : చంద్రబాబు
Chandrababu
Follow us on

Mango farmers in Andhra Pradesh : మామిడి రైతుల్ని మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలోని సిండికేట్లు నిట్టనిలువునా దగా చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని మామిడి రైతుల సమస్యలను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని చంద్రబాబు అన్నారు. తాము ఎంతో పండించిన మామిడి పంటకు అసలే గిట్టుబాటు ధరల్లేకపోతే.. వైకాపా నేతలకు కమీషన్లు కావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం నుంచి సాయం పూర్తిగా కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెండేళ్ల పాలనలో రైతులు సంతోషంగా లేరన్న చంద్రబాబు, ఏపీలో అన్నదాతల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని అన్నారు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులంతా సిండికేట్‌గా మారి చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తమ శ్రమను దోచుకుంటున్నారని మామిడి రైతులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుతోపాటు, మామిడి రైతులకు ధరల స్థిరీకరణ సంస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మామిడి రైతులు ఈ సంవత్సరం వరుస నష్టాలు చవిచూస్తున్నారని, సరిగ్గా కాయలు వచ్చే సమయానికి కర్ఫ్యూతోపాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఎగుమతులు నిలిచాయని చంద్రబాబు తెలిపారు. మామిడి రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదన్నారు చంద్రబాబు.

Read also : Gold : పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ దాదాపు రూ. ఐదున్నర కోట్లు విలువైన బంగారం